తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090

Rising gold prices
Rising gold prices

Mumbai: దేశంలో బంగారం ధర లు పెరిగిపోతున్నాయి. మార్చిలో ఈ ధరను 3 శాతం క్షీణిస్తే తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ 530 రూపాయలు పెరిగింది. రూ. 43,370 ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం.. ఈ రోజు 43,900 ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 600 పెరిగింది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440 గా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090కు చేరింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/