నేడు ఏపిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

AP 10th exam results released today

అమరావతిః నేడు ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి కాకుండా… సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేయబోతున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టెన్త్ రిజల్ట్స్ రాకముందే ఎంతో మంది విద్యార్థులు పలు ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటుండటం గమనార్హం.