చిన్నకొండుర్ గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ కు చేదు అనుభవం

మునుగోడు ఉప ఎన్నిక బరిలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ కు సొంత నియోజకవర్గం లో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి నియోజకవర్గానికి ఏంచేసావని .. తమ ఊరి మొహం చూడని నువ్వు.. మళ్లీ ఇప్పుడు ఎలా ఓట్లడుగుతావు అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాగా, రీసెంట్ గా చౌటుప్పల్ మండలం చిన్నకొండుర్ గ్రామంలో మొన్న ఆయన సతీమణిని నిలదీయగా ఆదివారం రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు గ్రామస్తులపైకి దాడికి దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గ్రామంలోకి రాగానే పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా గ్రామస్థులు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. బీజేపీ డౌన్ డౌన్ , కాంట్రాక్టులు కోసం కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ప్రజలకు ద్రోహం చేసిన రాజ్ గోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దాడికి దిగిన వారిని రాజగోపాల్ ప్రోత్సహించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువురు శాంతిపచేసారు.