కరోనా దెబ్బకు వెనకడుగు వేసిన విరాటపర్వం

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘విరాటపర్వం’ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తు్న్నారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ చక్కటి లవ్‌స్టోరిని మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ భారీ స్థాయిలో విజృంభిస్తుండటంతో, ఈ సినిమా రిలీజ్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేశారు. ఈ మేరకు విరాటపర్వం చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.

ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి నక్సలైట్ పాత్రలో నటిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.