డీజే టిల్లు 2 నుండి అనుపమ అవుట్..?

కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుపమ..తాజాగా డీజే టిల్లు నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. సిద్దు – నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఈ సినిమా కు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించిన మేకర్స్..తాజాగా సీక్వెల్ ను మొదలుపెట్టారు. సీక్వెల్ లో నేహా శెట్టి కి బడులు అనుపమ ను తీసుకున్నారు. అయితే మరి ఏమైందో తెలియదు కానీ అనుమప ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది.

ఆమె ప్లేస్ లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను ఓకే చేసారని సమాచారం. ప్రస్తుతం అనుపమ..నిఖిల్ సరసన 18 పేజెస్ మూవీ లో నటించింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తికేయ 2 తో అలరించిన ఈ జంట..మరోసారి కనువిందు చేయబోతుండడం తో ఈ సినిమా ఫై అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. కుమారి 21 ఎఫ్ సూర్య ప్రతాప్..ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తున్నాడు.