తిరుమల శ్రీవారి హుండీకి భారీగా పెరిగిన ఆదాయం

Tirumala Temple
Tirumala Temple

తిరుమల శ్రీవారి హుండీకి చాల రోజుల తర్వాత భారీగా ఆదాయం వచ్చింది. గత కొద్దీ రోజులుగా తిరుపతి లో భారీ వర్షాలు పడుతుండడంతో భక్తుల రాక తగ్గింది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో మళ్లీ తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. నిన్న మంగళవారం శ్రీవారిని 32,173 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,811 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మళ్లీ చాలా రోజుల తర్వాత స్వామివారి ఆదాయం రూ.4 కోట్లు దాటింది.

ప్రస్తుతం అంతటా కరోనా కేసులు పెరుగుతుండడం తో టీటీడీ మాస్క్ తప్పనిసరి చేసింది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.