మంకీపాక్స్‌ పేరు మార్పుః డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

పేరుపై ఆందోళన వ్యక్తం చేసిన పలు దేశాలు

who-recommends-new-name-for-monkeypox

జెనీవాః మంకీపాక్స్‌ పేరును ఎంపాక్స్‌గా మార్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ప్రపంచ నిపుణులతో పలు సంప్రదింపుల తర్వాత ఈ పేరును ప్రకటించింది. మంకీపాక్స్, ఎంపాక్స్ అనే పేర్లు ఏడాది పాటు ఉపయోగంలో ఉంటాయని, ఆ తర్వాత మంకీపాక్స్ అనే పేరు కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.

ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాపించినప్పుడు ఆన్‌లైన్, ఇతర సెట్టింగులు, కొన్ని కమ్యూనిటీల్లో జాత్యహంకార, కళంకం కలిగించే భాషను ఉపయోగించడాన్ని గుర్తించి ఆ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. ఆ తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేశాయి.

జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓను కోరాయి. దీంతో పలు పరిశీలనలు చేసిన సంస్థ చివరికి ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/