బాలయ్య కొత్త మూవీకి ‘వీర మాస్’ టైటిల్?

బాలకృష్ణ, కేఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఫై ఓ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీకి ‘వీర మాస్’ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే వార్త వినిపిస్తుంది. ఇప్పటికే నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లు వార్తలొస్తున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సెంటిమెంట్ ప్రకారం ‘వీర’ అనే అక్షరాలు కలిసివచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

ఈ చిత్రం 1980 దశకంతో పాటు నేటి జనరేషన్ స్టోరీతో రూపొందుతోంది. ఇది డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. బాలయ్య కెరీర్‌లో గతంలో టచ్ చేయని పాయింట్‌తో డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.