ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సిఎం జగన్‌

వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణను సిద్ధం చేయండి.. అధికారులకు జగన్ ఆదేశం

cm-jagan-participated-pm-modi-video-conference

అమరావతి: ప్రధాని నరేంద్రమోడి పలు రాష్ట్రల సిఎంలతో కరోనాపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపి సిఎం జగన్‌ పాల్గొన్నారు. వ్యాక్సిన్ తయారీ, వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి, పంపిణీ సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచానా వేయాలని సిఎంలకు సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని మోడి అభిప్రాయపడ్డారు. అనంతరం రాష్ట్ర అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.

వ్యాక్సిన్ పంపిణీలో పాటించాల్సిన శీతలీకరణ పద్ధతులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులను జగన్ ఆదేశించారు. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో వాటిని మారుమూల ప్రాంతాలకు తరలించడం అనేవి చాలా కీలకమైన విషయాలని… దీనికి సమగ్రమైన ప్రణాళిక రచించాలని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేయాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు.

కాగా, తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం సిఎం జగన్‌ ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/