అంతర్వేది ఆలయం నూతన రథం ప్రారంభం

సీఎం జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనం

CM YS Jagan launching the new chariot
CM YS Jagan launching the new chariot

East Godavari: అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు.  సీఎం వైఎస్ జగన్‌కు  వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన  ప్రారంభించారు.

40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/