హైదరాబాద్ HICC నోవాటెల్ లో మూడు రోజుల పాటు వైభవోపేత వాణిజ్య మహోత్సవం

ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా
హైదరాబాద్ జ్యువెలరీ పెరల్ & జెమ్ ఫెయిర్ (HJF) గ్రాండ్ 15వ ఎడిషన్‌కు
మెరుపులను జోడించడానికి 1,00,000+ కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌లు
 
ముత్యాల నగరంలో HICC నోవాటెల్ హైదరాబాద్‌లో భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల మూడు రోజుల వైభవోపేత వాణిజ్య మహోత్సవం
ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా, కీలక సంఘాలైన HJMA, IBJAల మధ్య వ్యూహాత్మక భాగ స్వామ్యంతో 15 సంవత్సరాల వారసత్వం, విశ్వాసం వేడుక
650కి పైగా బ్రాండ్‌లు, 8,000 మందికి పైగా నిపుణులు, ఆఫ్టర్-అవర్స్ నెట్‌వర్కింగ్ & ఫ్యాషన్ షో, పవర్-ప్యాక్డ్ కాన్ఫరెన్స్‌ లు ప్రదర్శనకు ప్రత్యేకతలను సంతరింపజేస్తాయి
 
హైదరాబాద్, 4 మే 2023: దక్షిణ భారతదేశం అత్యంతగా ఎదురుచూస్తున్న ప్రీమియం ఆభరణాల వాణిజ్య ప్రదర్శన హైదరాబాద్ జ్యువెలరీ, పెర్ల్, జెమ్ ఫెయిర్ (HJF 2023), తన 15వ మైలురాయి ఎడిషన్‌తో తిరిగి ముత్యాల నగరంలోకి వచ్చింది. ఈ టర్న్‌ కీ ఎగ్జిబిషన్ 2023 జూన్ 9 – 11 మధ్య హెచ్‌ఐసిసి, నోవాటెల్, హై టెక్ సిటీలో జరుగుతుంది. హెచ్ జెఎఫ్ 2023 అత్యుత్తమ ఆభరణాలు, పరిశ్రమల నిపుణులు, దిగుమతి, ఎగుమతి వ్యాపారులు, పరిశ్రమ సంఘాలను ముత్యాల నగరంలోకి తీసుకురావడం ద్వారా ట్రెండ్‌లు, సం ప్రదాయాలను మిళితం చేసే అత్యుత్తమ కళానైపుణ్యాలతో కూడిన కలెక్షన్‌లను ప్రదర్శిస్తుంది. భారతదేశం లోని ప్రముఖ బి2బి ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ అయిన ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఈ ఫ్లాగ్‌ షిప్ షోను హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (HJMA), ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)తో కలిసి నిర్వహిస్తోంది. ఐబీజేఏ దీనిలో పాల్గొనడం ఇదే మొదటిసారి.


ఈ ఈవెంట్ త్వరలో ప్రారంభం కానున్నందున, భారతదేశంలోని రత్నాలు & ఆభరణాల పరిశ్రమ 15 సంవ త్సరాల వారసత్వం, ఎక్స్‌ పో 15 సంవత్సరాల వారసత్వం గురించి బ్రీఫింగ్ అందించడానికి ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ ను ఏర్పాటు చేసింది. ఇది దక్షిణాదిన పరిశ్రమకు కేంద్రంగా నగరం యొక్క ప్రముఖ స్థానాన్ని కూడా చాటిచెప్పింది.


 హెచ్ జెఎఫ్ లో పాల్గొనడం, భాగస్వామ్యం కావడం గురించి, హైటెక్ సిటీ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసి యేషన్ (HJMA) వైస్ ప్రెసిడెంట్ ముఖేష్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘‘‘హెచ్ జెఎఫ్ ఒక మైలురాయి ఎక్స్‌ పో. ఇది సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలను అందించింది. కొనుగోలుదారులు, తయారీదారుల నుండి చక్కటి ఫీడ్ బ్యాక్ తో బాగా ఆకట్టుకుంది. 15 సంవత్సరాలుగా, ప్రదర్శనకు అపారమైన ప్రజాదర ణను తీసుకురావడానికి మా సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇది దక్షిణ భారత ప్రాంతంలో అతి పెద్ద ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. ఇది పరిశ్రమలోని ప్రతి సంస్థకు వ్యాపార వృద్ధికి సహకరించడానికి అవకాశాన్ని ఇస్తుంది. మా హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (HJMA), హైదరాబాద్‌ లో, HJF 2023కి మద్దతు ఇస్తోంది. వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ నమో దు చేసుకోవాలని, ప్రదర్శనను సందర్శించాలని అభ్యర్థిస్తున్నాం’’ అని అన్నారు.


హెచ్ జెఎఫ్ తో తొలి అనుబంధం గురించి ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్. (IBJA) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేతన్ కుమార్ మెహతా మాట్లాడుతూ, ‘‘ఆభరణాల ప్రదర్శనలు నిర్వహిం చడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇన్ ఇండియాతో ప్రదర్శన 15వ ఎడిషన్ సందర్భంగా HJMA భాగస్వామ్యం కావడం పట్ల మేం సంతోషిస్తున్నాం. ఈ భాగస్వామ్యం మా మధ్య వ్యా పార, నెట్‌వర్కింగ్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ డైనమిక్ మార్కెట్‌లో ఉత్తమమైన డీల్‌లను పొం దేందుకు సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి ఈ అవకాశం నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను’’’’ ’అని అన్నారు.


హెచ్ జెఎఫ్ 650కి పైగా సంప్రదాయ, ఆధునిక, వినూత్నమైన ప్రత్యేకమైన బ్రాండ్‌లను ప్రదర్శిస్తుంది. ఈ సంవత్సరం ఆభరణాల బ్రాండ్లు, ఫైన్ ఫినిష్డ్ జ్యువెలరీ తయారీదారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, దిగు మతిదారులు, ఎగుమతిదారులు, ఆభరణాల తయారీదారులు, యంత్రాల తయారీదారులు, వజ్రాలు, రత్నా లు, లూజ్ స్టోన్స్, ముత్యాల తయారీదారులు, విలువైన మెటల్, ఆభరణాల ప్యాకేజింగ్ వ్యాపారులతో సహా 250 మంది ప్రముఖ ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ప్రదర్శన, హాల్‌మార్కర్‌లు, అస్సేయర్‌లు, వాణిజ్యం, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు. ఎగ్జిబిటర్ల ద్వారా 1,00,000 + ప్రత్యేక డిజైన్‌లు ప్రదర్శించబడతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌లో వ్యూహాలు, సాంకేతికతలను అన్వేషించడం, భారతదేశంలో ఆభరణాలు & ర త్నాల పరిశ్రమ భవిష్యత్తును నిర్వచించే విధానాలను విశ్లేషించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ముంబై, తెలంగాణ, తమిళనాడు, దిల్లీ, గుజరాత్ మొదలైన భారతీయ నగరాల నుండి కూడా పాల్గొంటారు. ఈ కార్య క్రమానికి పూర్వరంగంగా కరీంనగర్, విజయవాడ, గుంటూరు, వరంగల్ వంటి వివిధ నగరాల్లో రోడ్ షోలు, అసోసియేషన్ సమావేశాలను కూడా హెచ్ జెఎఫ్ నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 80 నగరాల్లోని ఆభరణాలను ఈ ప్రదర్శన అనుసంధానం చేస్తుంది.


ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జ్యువెలరీ, పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ 2023 ప్రకటనపై ఇన్ఫా ర్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ, “రత్నాలు, ఆభరణా ల పరిశ్రమ చలనశీలతతో ఉంటోంది, రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారుగా ఉంది. దీని రత్నాలు, ఆభరణాల రంగం అతిపెద్ద రంగాలలో ఒకటి. 2022-23లో, పరిశ్రమ ఎగుమతులు రూ. 3,00,462.52 కోట్లకు ($37,468.66 మిలియన్లు) చేరుకు న్నాయి. సాదా బంగారు ఆభరణాల ఎగుమతుల్లో 17% పెరుగుదల. అమెరికా, హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశ ప్రధాన ఎగుమతి మార్కెట్లు. మా ప్రపంచ ఉనికితో, 15 సంవత్సరాలలో మార్కెట్ పల్స్‌ పై లోతైన అవగాహనతో, ఈ మైలు రాయి సంవత్సరంలో హెచ్ జెఎఫ్, ఏకీకృత భాగస్వామ్యాలతో, పరిశ్రమ అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని, ధోరణులను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఇది స్వర్ణకారులు, ది గుమతి & ఎగుమతి వ్యాపారులు, పరిశ్రమ సంఘాలు ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడానికి, డైన మిక్స్‌ ను ఎదుర్కొనేందుకు, కొత్త పరిష్కారాలు, అవకాశాలను అన్వేషించడానికి అవకాశాలను ఒకే గొడు గు కింద అందిస్తుంది. హెచ్ జెఎఫ్ 15వ ఎడిషన్ గొప్ప విజయాన్ని సాధిస్తుందని, ముఖ్యంగా దక్షిణాదిలో రత్నాలు, ఆభరణాల రంగం సుస్థిర అభివృద్ధికి దోహదపడుతుందని మేం విశ్వసిస్తున్నాం’’’’ అని అన్నారు.


హెచ్ జెఎఫ్ 15వ ఎడిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సందర్భంగా ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండి యా సీనియర్ గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రా మాట్లాడుతూ, భారతదేశ గౌరవనీయ & అభివృద్ధి చెందుతున్న సంఘాలలో ఒకటైన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA)తో అనుబంధం కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. హైటెక్‌సిటీ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్‌తో 15 సంవత్సరాల పాటు మా అనుబంధం మరియు IBJAతో వ్యూహాత్మక భాగస్వామ్యం రత్నాలు, ఆభరణాల పరిశ్రమను మరింత ప్రభావవంతంగా అందించడంలో మాకు సహాయం చేస్తుంది. ఈ డైనమిక్ అసోసియేష న్ల నుండి పొందిన నైపుణ్యం హైదరాబాద్ జ్యువెలరీ పెరల్, జెమ్ ఫెయిర్ 2023కి కొత్త వ్యాపార కోణాన్ని ఇస్తుందని, పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.
ప్రదర్శన సందర్భంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ కమ్యూనిటీ మొదటి రోజున ది పవర్ ఆఫ్ యంగ్‌తో ఒక ప్ర త్యేకమైన సాయంత్రం ఈవెంట్‌ ను చూడనుంది. ఇది దక్షిణ భారతదేశంలోని రత్నాలు, ఆభరణాల కమ్యూ నిటీకి సంబంధించిన యువ ఆభరణాల వ్యాపారుల విజయాలను వేడుక చేసుకుంటుంది. ఆ తర్వాత టాప్ ఎగ్జిబిటర్‌లచే సీజనల్ ట్రెండ్‌లను ప్రదర్శించే ఆకర్షణీయమైన ఫ్యాషన్ షో, నెట్వర్కింగ్ నైట్ ఉంటాయి. హో ల్‌సేల్ వ్యాపారులు, రిటైలర్లు, దిగుమతిదారులు, డిజైన్ హౌస్‌లు, బంగారం, వజ్రాలు, ముత్యాలు, వెండి, రత్నాలను సోర్సింగ్ చేసే ఆభరణాల తయారీదారులు, స్వతంత్ర రిటైలర్లు, వ్యాపార యజమానులతో సహా 8,000 మంది సందర్శకులు ప్రదర్శనను సందర్శిస్తారు.


ఇన్‌ఫార్మా మార్కెట్స్ గురించి


పరిశ్రమలు, స్పెషలిస్ట్ మార్కెట్‌లు మొదలుకొని వర్తకం, ఆవిష్కరణలు, అభివృద్ధి లాంటి వాటి కోసం ప్లాట్‌ ఫామ్‌లను ఇన్‌ఫార్మా మార్కెట్స్ సృష్టిస్తుంది. మా పోర్ట్‌ ఫోలియోలో హెల్త్‌ కేర్ & ఫార్మాస్యూటికల్స్, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ & రియల్ ఎస్టేట్, ఫ్యాషన్ & అపెరల్, హాస్పిటాలిటీ, ఫుడ్ & బెవరేజీ, హెల్త్ & న్యూట్రిషన్ వంటి మార్కెట్‌ లలో 550 కంటే ఎక్కువ అంతర్జాతీయ B2B ఈవెంట్‌లు,బ్రాండ్‌లు ఉన్నాయి. మేం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లు, భాగస్వాములకు ముఖాముఖి కలుసుకోవడం, స్పెషలిస్ట్ డిజిటల్ కంటెంట్, యాక్షనబుల్ డేటా సొల్యూషన్‌ల ద్వారా నిమగ్నమవ్వడానికి, అనుభూతి చెందడానికి, వ్యాపారం చేయ డానికి అవకాశాలను అందిస్తాం. ప్రపంచంలోని ప్రముఖ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్‌గా, మేం విభిన్న శ్రేణి స్పెషలి స్ట్ మార్కెట్‌లకు జీవం పోస్తాం, అవకాశాలను అన్‌లాక్ చేస్తాం, సంవత్సరంలో 365 రోజులు అభివృద్ధి చెం దడానికి వారికి సహాయం చేస్తాం. మరింత సమాచారం కోసం, దయచేసి www.informamarkets.com సంద ర్శించండి
 
ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మరియు మా వ్యాపారం గురించి


ఇన్‌ఫార్మా మార్కెట్స్ అనేది ప్రముఖ B2B సమాచార సేవల సమూహం. ప్రపంచంలోనే అతిపెద్ద B2B ఈ వెంట్స్ ఆర్గనైజర్ అయిన Informa PLC యాజమాన్యంలో ఉంది. భారతదేశంలోని ఇన్‌ఫార్మా మార్కెట్స్ (గ తంలో UBM ఇండియా) అనేది భారతదేశంలోని ప్రముఖ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తం గా ఉన్న స్పెషలిస్ట్ మార్కెట్‌లు, కస్టమర్ కమ్యూనిటీలకు, ఎగ్జిబిషన్‌లు, డిజిటల్ కంటెంట్ & సేవలు, కాన్ఫ రెన్స్‌ లు & సెమినార్‌ల ద్వారా వాణిజ్యం, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందడానికి సహాయం చేయడానికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం, మేం దేశవ్యాప్తంగా పరిశ్రమ అవార్డ్‌ లు, శిక్షణలతో పాటుగా పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్, 40 కాన్ఫరెన్స్‌ లను నిర్వహిస్తాం. తద్వారా బహుళ పరిశ్రమల వర్టికల్స్‌ లో వాణిజ్యానికి అవకాశం కల్పిస్తాం. భారతదేశంలో ముంబై, న్యూదిల్లీలో ఇన్‌ఫార్మా మార్కెట్స్ కార్యాలయాలు ఉన్నాయి.