జగనన్న ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను – రోజా

జగనన్న ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోను అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా . సోమవారం ఉదయం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లో అవకాశం రావడంతో మంత్రులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

ఈ సందర్భాంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన గుర్తింపు ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా అవకాశమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కేబినెట్‌లో మహిళ మంత్రిగా ఉండటం తన అదృష్టం అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసం పని చేస్తానన్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పని చేస్తానని హామీఇచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. జగన్ ఆమెను ఆశీర్వదించారు.