త్రిషకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి..అందాల భామ త్రిష కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా విశ్వంభర మూవీ లో నటిస్తున్నారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొద్దీ రోజులుగా జరుపుకుంటూ వస్తుంది.

కాగా తాజాగా త్రిష కు చిరు గిఫ్ట్ అందించారు. ఖరీదైన టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ మగ్‌ ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ గిఫ్ట్ పట్ల తన ఆనందాన్ని త్రిష సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్‌ వెల్లడించారు.