లాటిన్ దేశాల్లో ప‌ది ల‌క్ష‌ల మంది మృతువాత

ఇది విషాద‌క‌ర మైలురాయి : ప్యాన్ అమెరికా హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ వ్యాఖ్య

corona deaths in Latin countries
corona deaths in Latin countries

క‌రీబియ‌న్‌ దేశాలతో పాటు లాటిన్ అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 10 ల‌క్ష‌లకు చేరుకుంది. ఈ దేశాల్లో వైర‌స్ సంక్ర‌మించిన కేసులు మూడు కోట్లు దాటిన‌ట్లు తెలిసింది. . అయిదు దేశాల్లో 90 శాతం మ‌ర‌ణాలు కేవ‌లం న‌మోదు అయ్యాయి. బ్రెజిల్‌లో 4.46 ల‌క్ష‌లు, కొలంబియాలో 83 వేలు, మెక్సికోలో 2.21 ల‌క్ష‌లు, పెరూలో 67 వేల మంది అర్జెంటీనాలో 73 వేల మంది మ‌ర‌ణించారు. కోవిడ్ వ‌ల్ల లాటిన్ దేశాల్లో ప‌ది ల‌క్ష‌ల మంది జీవితాలు మృత్యువు పాలయ్యాయని తెలిపారు. ఈ ప్రాంత వాసుల‌కు ఇది విషాద‌క‌ర మైలురాయి అని ప్యాన్ అమెరికా హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ డైర‌క్ట‌ర్ కారిసా ఎటిన్నా తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/