విశాఖ బీచ్ లో పవన్ సందడి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ బీచ్ లో సందడి చేశారు. రెండు రోజుల పర్యటన లో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖ లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ప్రధాని మోడీ ని కలిసిన పవన్ కళ్యాణ్..ఈరోజు విశాఖ బీచ్ లో నాదెండ్ల మనోహర్ తో కలిసి సందడి చేసారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు. వారి జీవనవిధానం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఓ డ్రోన్ కూడా పవన్ కల్యాణ్ బీచ్ విహారాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ ఫొటోలపై విశేషంగా స్పందిస్తున్నారు.

అలాగే బీచ్ పక్కనే ఉన్న రుషికొండ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. గత కొద్దీ నెలలుగా రుషికొండ ఫై వైస్సార్సీపీ నేతలు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని , రుషికొండ ను మొత్తం తవ్వేస్తుందని ఆరోపణల నేపథ్యంలో స్వయంగా దానిని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు.

కొంతమంది పార్టీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల అవతలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు.