టీఆర్ఎస్‌ ప్లీనరీలో ఎన్ని రకాల వంటకాలు వడ్డించబోతున్నారో తెలుసా..?

రేపు (ఏప్రిల్ 27) టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని HICC లో ప్లీనరీ సభ ఏర్పటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఏర్పటలు పూర్తి చేసారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలుండడంతో రాష్ట్ర స్థాయిలో పార్టీ బలాబలాలు, ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ, అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ విమర్శలు నేపథ్యంలో ఈ ప్లీనరి జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ జరగనుంది. గత అక్టోబర్‌లోనే తెరాస ద్విదశాబ్ధి ప్లీనరీ జరగ్గా.. ఆరు నెలల వ్యవధిలో మరో ప్లీనరీ పార్టీ నిర్వహిస్తోంది.

ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు సహా మొత్తం 3 వేల మందికి ఆహ్వానం పంపారు. పురుషులు గులాబీ రంగు దుస్తులు, మహిళలు గులాబీ రంగు చీరల్లో హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10-11 గంటల మధ్య ప్రతినిధుల నమోదు.. స్వాగతోపన్యాసం, సీఎం కేసీఆర్ స్పీచ్‌ ఉంటాయి. ఇదిలా ఉంటె.. టీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి రాష్ట్రంలోని కార్యకర్తలు, గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగరస్థాయి నేతలు అందరూ రానున్నారు. అయితే ఈ సమావేశాలకు హజరుకానున్న వారికి ఆతిధ్యంలో 33 రకాల వంటకాలు వడ్డించబోతున్నట్లు సమాచారం.

అవి ఏంటి అంటే..డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ, వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌ వంటివి వడ్డించబోతున్నారు.