బాలయ్య షోకు పవన్ వేసుకొచ్చిన హుడీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది. ఈ షో కు పవన్ కళ్యాణ్ వస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఆత్రుత పెరిగింది. ఈ షో లో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాగా..ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓ టాక్ షో కు హాజరు కాబోతుండడం తో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక ఈ షో లో పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు వేసారో..ఏ ఏ సమాదానాలు రాబట్టారో తెలుసుకోవాలని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షో లో ఈ ప్రశ్నలు వేశారని కొన్ని సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటె ఈ షో కు పవన్ కళ్యాణ్ హుడీ వేసుకొని వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో డ్రసింగ్ స్టైల్ నయా ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఖుషీ సినిమాలో పవన్ వాడిన హుడీలు తెగ ట్రెండ్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ అంతా అదే తరహా హుడీలు వేసుకొని హడావిడి చేశారు. ఇక ఇప్పుడు ఖుషీ సినిమా రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31న ఖుషీ రిలీజ్ కానుంది. దాంతో మరోసారి పవన్ ధరించిన హుడీలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో పవన్..బాలయ్య షో కు వేసుకొచ్చిన హుడీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య షోకు పవన్ వేసుకొచ్చిన హుడీ ధర విదేశాల్లో అయితే 245 డాలర్లు.. అంటే మనదగ్గర 27వేల రూపాయిలు. హుడి హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.