మహిళను బలిగొన్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం

మృతురాలి కుటుంబ సభ్యులు, స్థానికుల రాస్తారోకో

Woman killed in police escort vehicle collision
Woman killed in police escort vehicle collision

Vijayawada : విజయవాడ నుండి మచిలీపట్నం వైపు వెళుతున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం , మంగళవారం సెంటర్ నుండి రోడ్డు దాటుతున్న వీరంకి బేబీ సరోజిని అనే మహిళను వేగంగా ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. ఆ మార్గంలో వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/