వెలుగులోకి బండి సంజయ్ కొడుకు మరో వీడియో

నిన్నటి నుండి సోషల్ మీడియా అండ్ మీడియా లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ పేరు సంచలనంగా మారింది. నిన్నంతా కూడా భగీరథ్ ఓ అబ్బాయిని బూతులు తిడుతూ ఇష్టమొచ్చినట్టు కొడుతున్న వీడియో వైరలై.. పెద్ద దూమారమే లేపింది. కాగా.. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో కూడా ఓ విద్యార్థిని బూతులు తిడుతూ కొడుతున్నట్టుగా ఉంది. అయితే.. ఇందులో బండి భగీరథ్ మాత్రమే కాకుండా.. అతని స్నేహితులంతా కలిసి ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో చుట్టుముట్టి బూతులు తిడుతూ, విచక్షణారహితంగా కొడుతూ, కాలితో తన్నుతూ ఉండటం వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో చూసిన వారంతా ర్యాగింగ్‌‌లోనే భాగంగానే ఆ అబ్బాయిని కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వీడియో లో ఉన్న బాధిత అబ్బాయిని ఎందుకు కొట్టారనే విషయం తెలియాల్సి ఉంది. ఇక నిన్న వైరల్ గా మారిన వీడియో ఫై పోలీసులు భగీరథ్‌ ఫై కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపట్ల బండి సంజయ్ స్పందించారు. తన కొడుకు తప్పు ఉంటే తానే స్వయంగా పోలీసులకు అప్పగిస్తానంటూ తెలిపారు. అయితే.. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు.. మళ్లీ కలుకుంటారంటూ కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి వాటికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తారంటూ అటు పోలీసుల మీద.. ఇటు ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. మరి ఇప్పుడు రెండో వీడియో ఫై ఏమంటారో అని అంత కామెంట్స్ వేస్తున్నారు.