దక్షిణాది సినిమాల్లోకి స్టార్ క్రికెటర్

Harbhajan Singh

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆయన కూడా తమిళ చిత్రంతోనే సినీ కెరీర్ స్టార్ట్ చేయనుండటం విశేషం. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో హర్భజన్ లీడ్ రోల్ చేయనున్నారు.

ఈ సినిమాకు ‘ఫ్రెండ్ షిప్’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇందొక థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు టీమ్. ఈ చిత్రాన్ని జె.పి.ఆర్, స్టాలిన్ సంయుక్తంగా నిర్మించనున్నారు. హర్భజన్ సింగ్ మూడు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించి ఉండటంతో తమిళనాట ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ సినిమాకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/