రైతులకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారు

విశాఖలో తక్కువ ఖర్చుతో రాజధాని కట్టొచ్చు

avanthi srinivas
avanthi srinivas

గుంటూరు: రైతులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఖచ్చితంగా న్యాయం చేస్తారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఇవాళ గుంటూరులో మీడియాతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్‌ విశాఖలో తక్కువ ఖర్చుతో రాజధాని కట్టొచ్చని తెలిపారు. చంద్రబాబు నాయుడు రూ.రెండున్నర లక్షల కోట్లు అప్పుచేసి పోయారు. రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీసే విధంగా విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదు. రాష్ట్రం బిహార్ కంటే వరస్ట్‌గా ఉందనడం మంచి పద్ధతికాదు. మీడియా, డబ్బు అండతో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అని మంత్రి అవంతి విమర్శలు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/