నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

రేపు తమిళనాడు తీరం దిశగా వాయుగుండం

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. నిన్న ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని హిందూ మహాసముద్ర పరిసరాల్లో కొనసాగుతోంది. నేడు మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు.

రేపు ఇది తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తుందని, ఫలితంగా రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. నిన్న రాయలసీమ, కోస్తాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 37, అనంతపురంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/