రిలయన్స్‌ జియోలో మరో సంస్థ భారీ డీల్

జియోలో రూ. 11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విస్టా ఈక్విటీ

reliance jio
reliance jio

ముంబయి: రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ సంస్థ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియో మరో భారీ కంపెనీతో పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈక్విటీ సంస్థ విస్టా ఈక్విటీ పార్టనర్స్, జియో ప్లాట్‌ఫార్మ్స్ ‌లో 2.3 శాతం వాటాలను దక్కించుకునేందుకు ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ ఫండ్ గా పేరున్న విస్టా దాదాపు రూ. 11,367 కోట్లను జియోలో పెట్టుబడిగా పెట్టనుంది. ఇందుకు సంబంధించిన డీల్ కూడా కుదిరిపోయింది. దీంతో వారం రోజుల వ్యవధిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న మూడో కంపెనీగా విస్టా నిలిచింది. కాగా విస్టాకు గతంలోనే టెక్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది. గత పదేళ్లలో సంస్థ చేసిన ఇన్వెస్ట్ మెంట్స్ అన్నీ ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చాయి. ఇండియాలో విస్టా పెడుతున్న మొట్టమొదటి పెట్టుబడి డీల్ ఇదే కావడం విశేషం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/