ఏదో ఘోరమైన పొరపాటు చేసుంటారు

కరోనా..చైనా చేతకానితనం అంటూ విమర్శలు

trump
trump

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చైనా పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈక్రమంలోనే ట్రంప్‌ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ..మరోసారి చైనాలో విరుచుకుపడ్డారు. కరోనా విషయంలో చైనాలో ఏదో ఘోరమైన పొరపాటు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. చైనా తప్పిదమో, లేక చేతకానితనమో… ఇప్పుడు యావత్ ప్రపంచం బాధపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను చైనా ఏదో ఒక దశలో నియత్రించే వీలున్నా అలా జరగలేదని అన్నారు. అసలు, కరోనాను దాని మూలం వద్దే నిలిపివేసే అవకాశం ఉంది, కానీ ఏదో జరిగింది అంటూ సందేహం వెలిబుచ్చారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/