డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు దొరికిన ‘సింగం’ నటుడు

సూర్య నటించిన సింగం చిత్రంలో విలన్ గ్యాంగ్ లో కనిపించిన నైజీరియన్​దేశస్థుడు, నటుడు చాక్‌‌‌విమ్​ మాల్విన్‌‌‌ డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికాడు. సింగం సినిమాలోనూ ఇతడు డ్రగ్స్ అమ్మే రోల్ లో నటించాడు. కానీ నిజ జీవితంలోను అదే చేసాడు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఇతడి వద్ద నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెపుతున్నారు. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు తెలిపారు.