తెలంగాణలో మరో 9 కరోనా పాజిటివ్‌ కేసులు

అన్నీ జోగులాంబ గద్వాల జిల్లాలోనే నమోదు

corona virus
corona virus

జోగులాంబ గద్వాల: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మర్కజ్‌ ఘటన వెలుగు చూశాక జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా జిల్లాలో మరో 9 కేసుల నమోదు అయ్యాయి. ఇవన్నీ కూడా మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారివే కావడం గమనార్హం. కాగా ఇందులో గద్వాల టౌన్‌లో 7 కేసులు నమోదు కాగా, రాజోలు మండల కేంద్రంలో మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/