లాక్ డౌన్ పొడిగింపు యోచన
రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు

New Delhi: ఈనెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ తొలి దశను పొడిగించే అవకాశాలున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నది. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని పొడిగించడం మినహా మరో గత్యంతరం లేదని కేంద్రానికి స్పష్టం చేశాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారంనాడు మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.
బతికుంటే బలుసాకు తినొచ్చునని ప్రాణం పోయాక మళ్లీ తేలేమని ఆయన చేసిన సూత్రీకరణతో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకీభవిస్తున్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మితంగానే ఉందన్న భావనతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.
అయితే ఉన్నట్టుండి ఢిల్లీ మర్కజ్ యాత్రికుల ప్రవేశంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/