చంద్రబాబుకు సెల్ఫీదిగే హక్కుందా? అంటూ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ఫై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మార్కాపురంలో వైస్సార్ ఈబీసీ నేస్తం ప‌థ‌కం రెండో విడ‌త అమ‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జగన్… ఈ సందర్బంగా చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కడబడితే అక్కడ ఫోటోలు దిగుతూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారని విమర్శించారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చాక, ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా సొమ్ము డీబీటీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశామని గుర్తు చేశారు. మరి చంద్రబాబు హాయాంలో ఆ డబ్బు అంతా ఏమైందో అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ జరిగిన మంచి ఎంత అనేది బేరీజు వేసుకొనే సత్తా నీకు ఉందా చంద్రబాబు అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉండేవా. దోచుకో, దాచుకో, తినుకో అన్నది చంద్రబాబు విధానం అంటూ ఫైర్‌ అయ్యారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు నిజమని చెప్పి ప్రజలను నమ్మేస్తారా.. నిజం ఏంటో ప్రజలకు తెలుసు, అందుకే నిజాలను దాస్తున్నారని నిప్పులు చెరిగారు సీఎం జగన్‌.