జనసేన 4 స్థానాల్లో కూడా గెలవలేదు – మాజీ మంత్రి అనిల్

anil-kumar-yadav

జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన రావడం ఫై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ..పవన్ కళ్యాణ్ కనీసం 15 శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. తీసుకున్న 24 సీట్లలో నాలుగు కూడా గెలవలేరని సెటైర్లు వేశారు. జనసైనికుల ఆశయాలను చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కూటమి ఓడిపోతుందని అనిల్ కుమార్ తెలిపారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కారణం అని.. చంద్రబాబు రాజకీయాల నుంచి ఇక తప్పుకుంటారని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు. రాజానగరంలో జనసేన అభ్యర్థి పై జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.