విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన : 92 మంది జనసేన కార్యకర్తలఫై కేసు

విసాఖా ఎయిర్ పోర్ట్ వద్ద వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై దాడి చేసిన ఘటన లో పోలీసులు 92 మంది జనసేన కార్య కర్తల ఫై కేసులు నమోదు చేసారు. అరెస్ట్ అయిన వారిలో 92 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. జనసేన వీరమహిళలను సైతం రాత్రి ఒంటి గంట సమయంలో మగ పోలీసులు పట్టుకుని వాహనాల్లోకి ఎక్కించడం గమనార్హం.

విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌ వద్ద మంత్రులపై దాడి కేసులో జనసేన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని , వెంటనే తమ పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టాలని, అప్పటివరకు విశాఖను వదిలి వెళ్లిపోనంటూ పవన్ పేర్కొన్నారు.

పవన్ బయటకు వస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి శాంతిభద్రల సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో విశాఖ విడిచి వెళ్లిపోవాల్సిందిగా పవన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలలోగా విశాఖను విడిచి వెళ్లాలని ఏసీపీ హర్షిత పవన్‌కు 41ఏ నోటీసులు అందించారు. నోటీసుల తర్వాత పవన్ విశాఖ ను వదిలి వెళ్తారని అనుకున్నారు కానీ పవన్ మాత్రం ప్రస్తుతం విశాఖ లోనే ఉన్నారు. మరికాసేపట్లో జనసేన ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణ ఫై చర్చించనున్నారు.