పరిపాలన అంటే టిక్‌టాక్‌లు చేయడం కాదు

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పై పంచుమర్తి అనురాధ విమర్శలు

panchumarthi anuradha
panchumarthi anuradha

అమరావతి: పరిపాలన అంటే టిక్‌ టాక్‌లు చేయడం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు చేశారు. కాగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుతూ పుష్పవాణి ఓ టిక్‌ టిక్‌ వీడియో చేసింది. దీనిపై స్పందించిన పంచుమర్తి అనురాధ విమర్శలు దిగారు. సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చే ప్రజలకు మంత్రి పుష్ప శ్రీవాణి అందుబాటలోకి రారని అనురాధ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తన చేతి గాజును అమరావతి పరిరక్షణ సమితికి ఇచ్చిన విషయంపై పుష్ప శ్రీవాణి విమర్శలకు కూడా అనురాధ కౌంటర్‌ ఇచ్చింది. రాజధాని ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే వాళ్ల పరిస్థితి చూసి చలించిపోయిన భువనేశ్వరి తన చేతి గాజును తీసి ఇచ్చారని అనురాధ చెప్పారు. రైతుల దీక్షకు మద్దతిచ్చిన భువనేశ్వరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/