బడుగు, బలహీన వర్గాలకు టెండర్‌ పెడుతున్నారు

ఒక్క అవకాశం లభించడం వల్లే ప్రజలకు ఎన్నో కష్టాలు, అనర్థాలు

nara lokesh
nara lokesh

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఒక్క అవకాశం లభించడం వల్లే ప్రజలకు ఎన్నో కష్టానష్టాలు, అనర్థాలు వచ్చాయని టిడిపి నేత నారా లోకేష్‌ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్‌ పెడుతున్నారని దుయ్యబట్టారు. పేద ప్రజలపై సీఎం జగన్‌కు ఉన్న వ్యతిరేకతను పెంచుకుంటూ పోతున్నారని, ఏడు లక్షల పెన్షన్లు ఎత్తేశారని నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. మొన్నటి వరకూ ఒక్క పెన్షన్‌ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైఎస్సార్‌సిపి ప్రభుత్వం, రీ వెరిఫికేషన్‌ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? అని ప్రశ్నించారు. ఇప్పుడు 20 లక్షల రేషన్‌ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసేలా ఒప్పింది జగన్‌ గారు అని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/