పవన్..శ్వాస తీసుకో ..ప్యాకేజీ వద్దు – అంబటి కౌంటర్

ambati rambabu counter to pawan kalyan

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి కలర్ ఫై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఫై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ ఫైర్ అయ్యారు. తన సినిమాలను అడ్డుకున్నారని… తాను విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు తనను వాహనం నుంచి, హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారని… సిటీ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశారని పవన్ అన్నారు.

మంగళగిరిలో తన వాహనం వెళ్లకుండా అడ్డుకున్నారని, కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా లేకుండా ఆటంకాలు కలిగించారని అన్నారు. ఇప్పుడు తన ప్రచార రథం వారాహి విషయంలో కూడా వివాదాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నన్ను ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ చొక్కాను అయినా వేసుకోనిస్తారా వైస్సార్సీపీ? అని ఆలివ్ గ్రీన్ కలర్ లో ఉన్న చొక్కాను ఆయన షేర్ చేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. శ్వాస తీసుకో పవన్ కల్యాణ్… ప్యాకేజీ వద్దు అంటూ ఎత్తిపొడిచారు. మరి రాంబాబు కామెంట్స్ ఫై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.