నేడు పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం

అనంతరం విహాస్ హోటల్ లో పార్టీ నేతలతో భేటీ

pawan kalyan
pawan kalyan

అమరావతి: ఏపిలో నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. నిన్న ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. మరోపక్క, ఈ పర్యటనలో భాగంగా ఆయన జనసేన నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారని జనసేన పార్టీ తెలిపింది. సాయంత్రం 4 గంటలకు తిరుపతి లోని విహాస్ హోటల్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం అవుతారని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు విహాస్ హోటల్ లో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని వివరించింది. రేపు, ఎల్లుండి కూడా పవన్ కల్యాణ్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/