చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

పూల వర్షం కురిపించినవారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు

Vijayasai reddy
Vijayasai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు. శాసనమండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట అని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగని… ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని అన్నారు. పూల ఖర్చు వృథా అయినట్టేనా? అని దెప్పిపొడిచారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టుముట్టిందేమిటి విజనరీ? అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. మరోవైపు, మండలి రద్దు చేయాలనే ప్రయత్నాన్ని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ముమ్మరం చేసింది. శాసనసభలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాస్ అవుతున్న బిల్లులకు… మండలిలో ఎదురుదెబ్బ తగులుతుండటంతో మండలి రద్దుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీని సైతం పొడిగించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/