భైంసాలో అధిక్యంలో కొనసాగుతున్న బిజెపి

bjp
bjp

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టిఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. అయితే బిజెపి అనూహ్యంగా పుంజకున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పలుచోట్ల కాంగ్రెస్‌ కంటే బిజెపి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భైంసాలో బిజెపి అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 14 పోల్‌ అవ్వగా..బిజెపికి 8, ఎంఐఎం 3, కాంగ్రెస్‌ 1, ఇతరులకు 1 ఓటు దక్కించుకున్నారు. అయితే ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో నాలుగు వార్డుల్లో ఎంఐఎం విజయం సాధించింది. ఆర్మూర్‌ మున్సిపాలిటీలో 7వార్డుల్లో బిజెపి గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నాలుగు వార్డుల్లో బిజెపి విజయం సాధించింది. మరికొన్ని వార్డుల్లో బిజెపి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/