వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్న బాలకృష్ణ స్నేహితుడు

Balakrishna and Kadiri Baburao
Balakrishna and Kadiri Baburao

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైఎస్‌ఆర్‌సిపిలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రహమాన్..డొక్కా చేరగా..కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు నేడో రేపో వైఎస్‌ఆర్‌సిపి కండువా కప్పుకోనున్నారు. ఇక, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నేత..మాజీ ఎమ్మెల్యె ..బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు తెలుగు దేశం వీడి, వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారు. కొద్ది రోజులుగా కదిరి బాబూరావు టిడిపి వీడుతారనే వార్తలు వస్తున్నా.. బాలకృష్ణ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా.. నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి చూసిన తరువాత..ఆయన టిడిపి వీడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని బాలకృష్ణ కు సైతం చెప్పారని..ఆ తరువాతనే సిఎం జగన్ సమక్షంలో బాబూరావు చేరికకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/