ఏపీలో దారుణం : ఈసీజీ చేయించుకునేందుకు వచ్చిన మహిళా ఫై లైంగిక దాడికి యత్నం..

ఏపీలో మహిళల లైంగిక దాడులు ఆగడం లేదు. ఓ పక్క ప్రభుత్వం కఠినశిక్షలు , చట్టాలు తీసుకొస్తున్న కామాంధుల్లో మాత్రం భయం , మార్పు రావడం లేదు. తాజాగా ఈసీజీ చేయించుకునేందుకు ల్యాబ్ కు వచ్చిన మహిళా ఫై లైంగిక దాడికి యత్నించిన ఘటన విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రైవేటు హాస్పటల్ లో వైద్యం కోసం వచ్చిన మహిళకు ఈసీజీ చేయించుకోవాలని డాక్టర్ సూచించడంతో ఆమె ఈసీజీ గదిలోకి వెళ్ళగా, అక్కడి ఉద్యోగి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె బయటకు పరిగెత్తుకొని వచ్చి బంధువులకు విషయం తెలపడంతో వారు డయల్ 100 కు ఫోన్ చేశారు. లైంగిక దాడి యత్నానికి గురైన బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఉద్యోగిని చితకబాదారు. సమాచారం అందుకున్న వెంటనే వన్ టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టగా ఆ సదరు బాధితురాలు ఇక్కడ ఎటువంటి సంఘటన జరగలేదని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం గమనార్హం.