నేటి నుంచే విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సు

జీ20 సదస్సుకు విశాఖపట్నం వేదికగా మారింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో జరగనుంది. నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్‌ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా, వసతి, భద్రతా ఏర్పాట్లు చేశారు. అతిథులను స్వాగతించడానికి ప్రత్యేక సాంస్కృతిక బృందాలను సిద్ధం చేశారు.

రెండు రోజులు మొత్తం 7 సెషన్స్(మొదటి రోజు నాలుగు, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరుగుతాయని వెల్లడించారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. 28వ తేదీ సాయంత్రం గాళ డిన్నర్ కు సీఎం వైఎస్ జగన్ హాజరవుతున్నారన్నారు. మొదటి రోజు నాలుగు, రెండవ రోజు మూడు సెషన్లు ఉంటాయన్నారు. 30న జీ 20 దేశాలు నుంచి వారికి ట్రైనింగ్ క్లాస్ లు ఉంటాయన్నారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. 31వ తేదీన దేశ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులతో సౌత్ కొరియా, సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలెజ్డ్ ఎక్సేంజ్ ఉంటుందన్నారు. పట్టణీకరణ ద్వారానే 80 శాతం జీడీపీ వస్తుందని సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. జీడీపీ వృద్ధికి కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పపనపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.

జీ20 సదస్సు నేపధ్యంలో విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్ని సుందరంగా అలంకరించారు. విశాఖ నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రదేశాలకు స్థానికులకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ తెలిపారు. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న G20 సదస్సు సందర్భంగా ఆయన ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.