వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలి పెళ్లి

Joe Biden’s eldest grandchild Naomi gets married to Peter Neal at White House

వాషింగ్టన్: వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు పెళ్లి ఘనంగా జరిగింది. తన ప్రియుడైన పీటర్ నీల్‌ ను నవోమి బైడెన్ వివాహమాడింది. ఈ వివాహనికి పరిమిత సంఖ్యలో అతిథులను అహ్వానించారు. 2021లో పీటర్ నీల్‌, నవోమి బైడెన్ ఎంగేజ్మెంట్ జరిగింది. వైట్హౌస్లో గత పదేళ్లలో పెళ్లి వేడుక జరగడం ఇదే తొలిసారి. అయితే వైట్ హౌస్ లో జరిగిన 19వ వివాహమిది. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి మనవరాలు పెళ్లి జరగడం ఇదే ప్రథమం. ఇంతకుముందు ఎక్కువుగా అధ్యక్షుడి కుమార్తెల వివాహాలే జరిగాయి.

దాదాపు గంటసేపు జరిగిన పెళ్లి వేడుకలో 250 మంది కుటుంబ సభ్యులు పాల్లొన్నారు. నవోమీ బైడెన్ వాషింగ్టన్‌లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈమె జో బైడెన్ కుమారుడైన హంటర్ బైడెన్ కూతురు. తనకంటే మూడేళ్లు చిన్నవాడైన నీల్ ను నవోమీ బైడెన్ వివాహమాడింది. పీటర్‌ నీల్‌ ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/