హాస్పటల్ లో చేరిన హీరో ఉపేంద్ర..ఆందోళనలో అభిమానులు

ఇటీవల కాలంలో వరుస పెట్టి సినీ నటి నటులు వరుస పెట్టి అనారోగ్యంతో హాస్పటల్ లో చేరుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో హాస్పటల్ లో చేరి..తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ ఘటన నుండి ఇంకా సినీ అభిమానులు ఇంకా బయట పడకముందే తాజాగా కమల్ హాసన్ అస్వస్థత తో హాస్పటల్ లో చేరారు.

ఇక ఇప్పుడు కన్నడ హీరో ఉపేంద్ర ..షూటింగ్ చేస్తున్న సమయంలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తగా వెంటనే బెంగళూరు నేలమంగళలోని హర్ష ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఉపేంద్ర హాస్పటల్ లో జాయిన్ అయ్యారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే డస్ట్‌ అలర్జీ కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ట్రీట్‌మెంట్ తీసుకున్న వెంటనే తిరిగి సెట్స్‌లో పాల్గొన్నాడు ఉపేంద్ర. అనంతరం తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతుండడంతో ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌ స్పాట్‌లోనే ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరాడు.

ప్రస్తుతం ఉపేంద్ర నాలుగైదు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న కబ్జా చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.