బికినీ లో అనసూయ..

బుల్లితెర , వెండితెర పాపులర్ యాక్టర్ అనసూయ..బికినీ లో దర్శనం ఇచ్చిన యూత్ లో వేడిసెగలు రేపింది. జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో మంచి నటి ఉందని విషయాన్నీ బయటపెట్టింది. ఆ తర్వాత నుండి వరుస అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పుష్ప మూవీ తో మరో మెట్టు ఎక్కింది.

అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోస్ , పిక్స్ తో అలరిస్తూ ఉంటుంది. తాజాగా బికినీ వేసుకుని జ‌ల‌కాలాడుతున్న ఫొటోల‌ను షేర్ చేసింది. అది కూడా త‌న ఫ్యామిలీ స‌భ్యుల‌తో క‌లిసి. ఈ పిక్స్ చూసి యూత్ తెగ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ బుల్లితెర కు దూరంగా ఉంటూ వెండితెర ఛాన్సులతో బిజీ గా మారింది.