జగన్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే రాపాక

జ‌నసేన పార్టీ త‌రుపున గెలిచి వైసీపీ గూటికి చేరిన కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు..సీఎం జగన్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. త‌న‌ కుమారుడి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ముద్రించిన శుభలేఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన భార్య భారతి రెడ్డి చిత్రాలను ముద్రించారు. వారి ఆశీస్సులతో తన కుమారుడి పెళ్లి జరుగుతోందని అందులో పేర్కొన్నారు. శుభలేఖ పైభాగంలో జగన్, భారతి చిత్రాలు ఆకట్టుకునేలా ముద్రించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ కార్డు చూసి వైస్సార్సీపీ అభిమానులు , కార్యకర్తలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

2024 ఎన్నికల్లో వైస్సార్సీపీ నుండి పోటీ చేసేందుకు రాపాక కు సీఎం జ‌గ‌న్ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఇలా రాపాక సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ ఫై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలుమార్లు బయట అసెంబీలో జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ రాపాక మాట్లాడి తన వీర విధేయతను నిరూపించుకున్నారు. ఇప్పుడు ఏకంగా తన కుమారుడి పెళ్లి ఆహ్వానపత్రికపై సీఎం దంపతుల ఫొటోలు ముద్రించి తాను జగన్ కు వీరభక్తుడినని మ‌రోసారి చాటిచెప్పారు.