సీఎం జగన్‌ బాధ్యత వహించాలి

చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Chandra babu- YS Jagan

Amaravati: ఏసీబీ అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం కుట్రేనన్నారు.

సభలో వైకాపా సర్కార్ అక్రమాలు, తప్పిదాలను బలంగా వినిపిస్తారన్న భయంతోనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు.

దీనికి సీఎం జగన్‌ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే హోంమంత్రి రాజీనామా చేయాలన్నారు. అచ్చెన్నాయుడి ఆచూకీని డీజీపీ వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయవసినదిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/