టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఏవీఎన్ రెడ్డికి నడ్డా అభినందనలు

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచిన ఏవీఎన్ రెడ్డికి కేంద్ర హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయమని తెలుపుతూ.. బండి సంజయ్ తో పాటు ఏవీఎన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని.. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయంతో తెలియజేస్తోందని తెలిపారు.

ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో మొత్తం 25416 ఓట్లు పోల్ కాగా..బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డికి అన్ని ప్రాధాన్యతల్లో కలిపి 13,436 ఓట్లు వచ్చాయి. బ్యాలెట్ పేపర్ విధానంలో ప్రాధాన్యతా బేసిస్ మీద జరిగిన ఓట్ల లెక్కింపు నిన్న (గురువారం) ఉదయం ప్రారంభం కాగా.. చివరి రౌండ్ ఇవాళ తెల్లవారుజామున పూర్తయింది. తన సమీప ప్రత్యర్థి పీఆర్‌టీయూ- టీఎస్ తరఫున పోటీ చేసిన గుర్రం చెన్నకేశవరెడ్డిపై 1150 ఓట్ల మెజార్టీతో ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు.