మరో నాల్గు రోజుల పాటు భారీ వర్షాలే..

అల్ప పీడన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుముల తో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.గురువారం మధ్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం పడుతూనే ఉంది. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ వల్ల.. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

రేపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, వికారాబాద్, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోను మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.