మోడీ – అమిత్ షా లతో ముగిసిన సీఎం జగన్ భేటీ

సీఎం జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ , కేంద్ర మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది.

స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంద‌ని సీఎం జగన్ ప్ర‌ధాని దృష్టికి తెచ్చారు. అరగంటకు పైగా సాగిన సమావేశంలో ప్రధానంగా 14 అంశాలను జగన్ ప్రస్తావించారు. అలాగే పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు సీఎం విన‌తి పత్రం అందించారు.