టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేస్తుంది

టెర్రరిస్టులకు కొన్ని దేశాలు సహాయసహాకారాలు అందిస్తున్నాయి

Bipin Rawat
Bipin Rawat

న్యూఢిల్లీ: టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా యుద్ధం చేస్తోందని డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. 9/11 దాడుల తర్వాత టెర్రరిస్టులపై అమెరికా ఉక్కుపాదం మోపిన విధంగా వ్యవహరిస్తే తప్ప టెర్రరిజాన్ని నియంత్రించలేమని ఆయన తెలిపారు. టెర్రరిస్టులకు కొన్ని దేశాలు సహాయసహాకరాలు అందిస్తున్నాయని ఇది కొనసాగినంత కాలం ఉగ్ర భూతాన్ని అంతం చేయలేమని బిపిన్‌ రావత్‌ అన్నారు. ఉగ్రవాధులకు ఆయుధాలు, నిధులను సమకూరుస్తున్నంత కాలం టెర్రరిజాన్ని అంతం చేయలేమని చెప్పారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే వారిని ఏకాకులను చేయాలని..వారికి సహకరిస్తున్న దేశాలను టార్గెట్‌ చేయాలని చెప్పారు. టెర్రరిస్టులకు సహకరిస్తున్న దేశాలను ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) బ్లాక్‌ లిస్టులో పెడుతుండటం మంచి పరిణామమని బిపిన్‌ రావత్‌ చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/