అవినాశ్ బెయిల్ పిటిషన్ పై తీవ్ర ఉత్కంఠ

 సుప్రీంకోర్టులో విచారణను ప్రారంభించిన వెకేషన్ బెంచ్

supreme-court-started-hearing-on-ys-avinash-reddy-bail-petition

న్యూఢిల్లీః మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అంశంలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న అవినాశ్ ను అదుపులోకి తీసుకునేందుకు నిన్న సీబీఐ అధికారులు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వారు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కాసేపటి క్రితం విచారణను ప్రారంభించింది. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహల బెంచ్ పిటిషన్ ను విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే విషయంలో టెన్షన్ నెలకొంది. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే సీబీఐ అధికారులు ఏం చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.