విద్యా దీవెన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడంపై.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ప్రైవేట్ యాజమాన్యాల తరపున తల్లుల ఖాతాలో నిధుల జమపై కృష్ణదేవరాయ వర్సిటీ అసోసియేషన్ సవాల్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీనిపై ఏపీ సర్కార్ డివిజనల్ బెంచ్‌లో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. యాజమాన్యాల తరపున ముతుకుమిల్లి శ్రీవిజయ్, సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/